![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -426 లో... దీప పుట్టుక గురించి శ్రీధర్ తప్పుగా మాట్లాడుతుంటే తండ్రి అని కూడా చూడకుండా తన పరువు మొత్తం తీసేస్తాడు కార్తీక్. అక్కడ నుండి వెళ్లిపొమ్మని చెప్తాడు. శ్రీధర్ డల్ గా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. దీప బాధపడుతుంటే తన గురించి తెలుసు కదా ఎందుకు బాధపడుతావని కార్తీక్ అంటాడు. కాంచన కూడా సారీ చెప్తుంది. ఆ తర్వాత శౌర్య వచ్చి తన మాటల్తో దీప నవ్వేలా చేస్తుంది.
శ్రీధర్ ఇంటికి వచ్చి డ్రింక్ చేస్తూ కోపంతో గ్లాస్ పగులగొడతాడు. ఏమైందని కావేరి అడగగా.. ఆ కార్తీక్ గాడు నన్ను అవమానించాడని చెప్తాడు. దీప ఒక అనాథ.. దానివల్లే వాడు రాజులా ఉండేవాడు అలా అయ్యాడని శ్రీధర్ అంటాడు. అందుకే మిమ్మల్ని అవమానించి పంపించుంటారని కావేరి అంటుంటే శ్రీధర్ కి ఇంకా కోపం వస్తుంది.
ఆ తర్వాత నిన్న జరిగింది మొత్తం దశరథ్ చెప్పాడు. కుబేర్ నిన్ను పెంచిన తండ్రి అంట కదా.. అతను చాలా గ్రేట్ అని శివన్నారాయణ అంటాడు. పక్కనే పారిజాతం ఉంటుంది. నువ్వు బస్టాండ్ లో ఏ టైమ్ కి దొరికావ్.. నీ స్పందన ఏంటని పారిజాతం తిక్కతిక్కగా మాట్లాడుతుంటే నిన్ను మెంటల్ హాస్పిటల్ లో వదిలి పెట్టి రావాలని శివన్నారాయణ అంటాడు. నన్ను కాదు మిమ్మల్ని వదిలి పెట్టి రావాలని పారిజాతం మెల్లిగా అంటుంది. ఆ మాటలని కార్తీక్ రికార్డు చేసి శివన్నారాయణకి వినిపిస్తాడు.
ఇలా ఇరికిస్తున్నావ్ ఏంట్రా అని పారిజాతం అంటుంది. దీనికి పనిష్మెంట్ ఉండాలి కదా అని కార్తీక్ బెత్తమ్ ఇస్తాడు. దాంతో పారిజాతం చేతిపై మళ్ళీ కొడతాడు శివన్నారాయణ. నాకు టైం వస్తుంది.. మీ సంగతి చెప్తానని పారిజాతం అంటుంది. మరోవైపు దీప దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది జ్యోత్స్న. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |